
హోళగుంద నూతన తహసీల్దార్ గా సతీష్ కుమార్
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నూతన తహసీల్దార్ గా సతీష్ కుమార్ భాద్యతలు స్వీకరించారు.అంతకు ముందు ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు పూల మొక్క అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో పత్తికొండ నుంచి హోళగుందకు బదిలీ పై రావడం జరిగిందన్నారు.మరియు మండల ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తానని తెలిపారు.
*నూతన తహసీల్దార్ ను కలిసిన కూటమి పార్టీ నాయకులు.
మండల కేంద్రంలో నూతన తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ సతీష్ కుమార్ ను కూటమి పార్టీ నాయకులు వీరన్న గౌడ్,బసవ,అశోక్, తిమ్మరెడ్డి,పిరన్న,వీరేశ్ తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువ పూలమాలలతో సత్కరించారు.
Was this helpful?
Thanks for your feedback!