FlatNews Buy Now
గ్రామ పంచాయతీ బోర్డు స్థలాన్ని కాపాడండి

గ్రామ పంచాయతీ బోర్డు స్థలాన్ని కాపాడండి

కర్నూలు, న్యూస్ వెలుగు; ఆలూరు నియోజకవర్గం హాలహర్వి మండలం బాపురం గ్రామంలోని గ్రామ పంచాయతీ బోర్డు స్థలానికి కబ్జా చేసిన ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి అనుచరులపై చర్యలు తీసుకోవాలని సోమవారం  కలెక్టర్ ఆఫీస్ ముందు బాపుర గ్రామ వాసి అయిన మోసయ్య అధ్యక్షతన  ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఐ పార్టీ కర్నూల్ నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి పాల్గొని  చేస్తున్న ఆందోళనకి సంపూర్ణ మద్దతు తెలిపారు.  ఈ ధర్నా కార్యక్రమంలో హాలహర్వి మండల రైతు సంఘం నాయకులు లింగారెడ్డి వీరయ్య రాజు పాల్గొని  మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి అనుచరులు ప్రభుత్వ స్థలాలను విచ్చలవిడిగా కబ్జాలు చేస్తూ ప్రభుత్వాన్ని కి చెందాల్సినటువంటి ఆస్తులను కాజేస్తున్నారు బాపూరం గ్రామపంచాయతీ బోర్డు స్థలమైన 135 సర్వే నెంబర్లులో గల భూమిని కబ్జా చేసి ఇండ్లు నిర్మాణం చేస్తున్నారు సంబంధిత ఎంపీడీవో గ్రామ పంచాయతీ సెక్రెటరీ గారి ఫిర్యాదు చేసినప్పటికీ ఫిర్యాదుదారులపైనే బైండోవర్ కేసు పెట్టించినటువంటి అధికారులు పంచాయతీ బోర్డు స్థలం కబ్జాకు గురవుతుందని జిల్లా అధికారైన డిపిఓ గారి దృష్టిలో పెట్టినప్పటికీ డిపిఓ గారు స్పందించకుండా కాలయాపన చేస్తున్నారు గట్టిగా నిలదీస్తే కోర్టులో స్టే ఆర్డర్ ఉన్నది మేము ఏమీ చేయలేము అని చేతులు ఎత్తేస్తున్నారు.ఈ స్థలం కబ్జా చేయబడిన వారి నుండి లక్షల రూపాయలు డిపిఓ కి ముట్టినాయని ప్రజలు  అధికారులు అనుకుంటున్నారు. కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూమిని కాపాడే వరకు పోరాటం చేస్తామని అవసరమైతే గ్రామ ప్రజలందరినీ సమీకరించి కలెక్టరేట్ దగ్గర నిరాహార దీక్షలు చేస్తామని వారన్నారు ధర్నా అనంతరం స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగినది డిపిఓ తో హాలహర్వి మండల తాసిల్దార్తో కలెక్టర్  మాట్లాడుతూ తక్షణమే మూడు రోజుల లోపు నాకు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించడం జరిగినది ఈ కార్యక్రమంలో బాపురం గ్రామ ప్రజలు  సిపిఐ నగర సహాయ కార్యదర్శులు మహేష్ శ్రీనివాసరావు బీసన్న ధనలక్ష్మి రామాంజి తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS