
సావిత్రిబాయి పూలే జయంతిని బాలికల అక్షరాస్యత దినోత్సవం ప్రకటించాలి
న్యూస్ వెలుగు, కర్నూల్; సావిత్రిబాయి పూలే జయంతిని బాలికల అక్షరాస్యత దినోత్సవం గా ప్రకటించాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా డిమాండ్ చేశారు. శుక్రవారం కర్నూలు మండలం ఉల్చాల గ్రామంలో ఎస్ఎఫ్ఐ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మండల కార్యదర్శి అంజి అధ్యక్షతన జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హాజరైన డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులతో కలిసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి అనంతరం మాట్లాడారు.
నేడు దేశంలో చదువుల్లో అమ్మాయిలు ముందంజలో ఉన్నప్పటికీ పురుషులతో పాటు సమానంగా చదువుకునే అవకాశం ఉండటంలో వెనకబడి ఉన్నారని అన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో పురుషులతో పాటు సమాన అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం చెందయని విమర్శించారు.
సావిత్రిబాయి పూలే జయంతిని బాలికల అక్షరాస్యత దినోత్సవంగా ప్రకటించి దేశం మొత్తం పురుషులతో పాటు సమాన అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సావిత్రిబాయి పూలే గారీ జీవితమంతా బాల్యవివాహాలు సతీసహగమనానికి బాలికల చదువుల కోసం కృషి చేశారని అన్నారు.
నేటికీ దేశంలో బాల్యవివాహాలు విపరీతంగా జరుగుతున్నాయని వాటికి సంపూర్ణంగా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు హత్యలు అదృశ్యాలపై సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో వ్యతిరేకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సత్రున్నిస బేగం మాట్లాడుతూ నాడు సావిత్రిబాయి పూలే త్యాగమే నేడు మనం అనుభవిస్తున్నామని కొనియాడారు సావిత్రిబాయి పూలే స్పూర్తితో విద్యార్థినీ విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి ఎదగాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.