ఎస్సీ వర్గీకరణ చారిత్రాత్మక తీర్పు
నంద్యాల : ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చినందని మాదిగ న్యాయవాదులు నంద్యాల జిల్లా డోన్ క పట్టనంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి , మందా కృష్ణ మాదిగ చిత్రపటానికి పూల మాల వేసి పాలాభిషేఖం చేసినట్లు తెలిపారు. ఈ సందర్బంగా సీనియర్ న్యాయవాదులు రవిప్రకాష్, గుండాల శ్యామసుందర్, హెచ్. బాలమద్దయ్య,డాక్టర్ గార్లపాటి మద్దులేటీ స్వామి, నడిపి కుళ్లాయి, పి. జీవన్ బాబు లు పాల్గొని మాట్లాడరు ఎస్సీవర్గీకరణ సమర్థనీయమని, ఎస్సీలు చాలా వెనుకబడిన వర్గాలుగా ఉన్నట్లు ఆధారాలున్నాయన్నారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ ఆవశ్యకత ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయపడిందని,కొన్ని కులాల్లో వర్గీకరణ చేసే వెసులుబాటు రాష్ట్రాలకు ఉండాలని సుప్రీం కోర్టు అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడుతూ తీర్పును వెల్లడించిందన్నారు. మాదిగలు 30 ఏళ్లుగా వర్గీకరణకు అనేక పోరాటాలు చేశారని కాంగ్రెస్ నేత గార్లపాటి మాడదిలేటి స్వామి అన్నారు.