ఎస్సీ హాస్టల్ ను పునరుద్ధరించాలి
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో నిర్మించిన ఎస్సీ హాస్టల్ భవనం నిరుపయోగంగా ఉందని,అయితే ఆ భవనం ఉపయోగించక నిరుపయోగంగా మారిందని గురువారం బిజెపి నాయకులు తహసీల్దార్ నిజాముద్దీన్ కు వినంతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ హాస్టల్ భవనం నిర్మించినప్పటి నుంచి ఇంతవరకు ఆ భవనం నిరుపయోగంగా ఉన్నదనీ కనీసం ఎస్టీ హాస్టల్ లేదా బీసీ హాస్టల్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలను కోరారు.ఈ కార్యక్రమంలో బిజెపి నేషనల్ కౌన్సిల్ మెంబర్ చిదానంద,మాజీ మండల అధ్యక్షులు ఏఈఎన్ ప్రసాద్,మండల జనరల్ సెక్రెటరీ మహేష్,నాయకులు బేనకప్ప,జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
0/400
Thanks for your feedback!