ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి

ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి

మాల మహానాడు జమ్మలమడుగు నియోజకవర్గ అధ్యక్షులు గోపాల్ దాస్ రాజశేఖర్

జమ్మలమడుగు, న్యూస్ వెలుగు;  ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి కాళ్లు మొక్కి క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని మాల మహానాడు జమ్మలమడుగు నియోజకవర్గ అధ్యక్షులు గోపాల్ దాస్ రాజశేఖర్ డిమాండ్ చేశారు. రఘురామకృష్ణంరాజు ఒక ప్రజా ప్రతినిధిగా సమాజంలో ఉండటం ఎంత మాత్రము శ్రేయస్కరం కాదన్నారు. ఎందుకంటే ఆయన ప్రజా ప్రతినిధి కావడానికి భారత రాజ్యాంగం ద్వారానే ఆయనను ప్రజలు ఎన్నుకున్నారని ఆ విషయాన్ని మర్చిపోయినట్లు ఉన్నారన్నారు. భారతదేశానికి ఒక దశ దిశను నిర్ణయించిన దైవం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఫ్లెక్సీని అక్కడ నుంచి తొలగించడం చాలా దుర్మార్గమని వంచనకరమని వారు ఆవేదన వ్యక్తపరిచారు. అలాగే అక్కడ ఏదైనా పొరపాటు జరిగి ఉంటే దానికి ఒక చట్టం ఉంటుందని దాన్ని ప్రకారం తొలగించాలన్నారు తక్షణమే ఆయన్ను సస్పెండ్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!