అట్టహాసంగా ప్రారంభమైన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల స్థాయి క్రీడా పోటీలు
* పోటీలను ప్రారంభించిన మండల విద్యాధికారి రమా వెంకటేశ్వర్లు
* క్రీడా పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులు.
తుగ్గలి, న్యూస్ వెలుగు : తుగ్గలి మండల పరిధిలోని గల పెండేకల్ ఆర్.ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు గురువారం రోజున స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల స్థాయి క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి రమా వెంకటేశ్వర్లు హాజరై,మండల స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. మండల వ్యాప్తంగా గల అన్ని ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి 6-10 తరగతి అభ్యసిస్తున్న విద్యార్థులకు నిర్వహించిన మండల స్థాయి క్రీడా పోటీలలో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.అండర్-14 మరియు అండర్-17 విభాగాలలో కబడ్డీ,ఖోఖో,వాలీబాల్,యోగ,షటిల్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల టోర్నమెంట్ కమ్ సెలక్షన్ విధానంలో ఎంపిక పోటీలు జరుగుతాయని తుగ్గలి మండలం స్కూల్ గేమ్స్ కోఆర్డినేటర్ పి.డి పాండురంగరాజు తెలియజేశారు. మండల స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు ఈనెల 24 మరియు 25 తేదీలలో నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండలో జరుగు నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీ ఎంపికల్లో పాల్గొంటారని ఆయన తెలియజేశారు.అనంతరం ఏపీపిఈటి మరియు ఎస్ఏపిఇ జిల్లా కార్యదర్శి, తుగ్గలి జడ్పీ హైస్కూల్ ఫిజికల్ డైరెక్టర్ చందు నాయక్ ను ఎంఈఓ రమా వెంకటేశ్వర్లు,తుగ్గలి మండలం ఫిజికల్ డైరెక్టర్లు శాలువాను కప్పి,పూలమాల వేసి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ అమీనా బేగం,వ్యాయామ ఉపాధ్యాయులు వేణుగోపాల్, హనుమన్న,ఆంజనేయులు,సలోమి, జయలక్ష్మి,మహేశ్వరి,క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.