
వినతి పత్రాన్ని అందజేసిన సచివాలయ ఉద్యోగులు.
తుగ్గలి న్యూస్ వెలుగు: సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగుల బదిలీలను ప్రమోషన్లను నిర్వహించి సీనియారిటీ ఆధారంగా పారదర్శకంగా నిర్వహించాలని మంగళవారం రోజున రాష్ట్రవ్యాప్తంగా సచివాలయం ఉద్యోగులు నిరసనను వ్యక్తం చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండల కేంద్రమైన తుగ్గలి లో మండల వ్యాప్తంగా గ్రామ సచివాలయ ఉద్యోగులు తుగ్గలి ఎంపీడీవో కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసనను వ్యక్తం చేసి అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు అందజేశారు. ఈ సందర్భంగా సచివాలయం ఉద్యోగులు మాట్లాడుతూ అన్ని శాఖల ఉద్యోగులకు ప్రమోషన్ ఛానల్ కల్పించి, స్పష్టమైన జాబు చార్జ్ ఇచ్చి బదిలీ ప్రక్రియను చేపట్టాలని, ట్రాన్స్ఫర్ ప్రక్రియను సీనియార్టీ మరియు మెరిట్ జాబితాల పరంగా పారదర్శకంగా నిర్వహించాలని, సచివాలయం ఉద్యోగులకు రావలసిన ఇంక్రిమెంట్ మరియు పెండింగ్ అరియర్స్ వెంటనే క్లియర్ చేసి,నోషనల్ ఇంక్రిమెంట్ కొరకు కమిటీని ఏర్పాటు చేయాలని, రేష్నలైజేషన్ ప్రక్రియ ద్వారా మిగులు సిబ్బందిని ప్రభుత్వం ఏ విధంగా వినియోగించుకుంటుందో స్పష్టత ఇవ్వాలని, బదిలీ ప్రక్రియలో సచివాలయ ఉద్యోగులు సొంత మండలాల్లో పనిచేసుకునేందుకు అవకాశం కల్పించాలని వారు ఎంపీడీవో కార్యాలయం నందు ఏ.ఓ మహబూబ్ బాషా కు,తహసిల్దార్ కార్యాలయం నందు డిప్యూటీ తహసిల్దార్ సుదర్శన్ కు వారు వినతిపత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షులు పులి శేఖర్,తుగ్గలి మండలం అన్ని శాఖల సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.