సీనియర్స్ టెన్నికాయిట్ క్రీడలో రాణించాలి క్రీడా దాత జి శ్రీధర్ రెడ్డి ప్రముఖ న్యాయవాది

సీనియర్స్ టెన్నికాయిట్ క్రీడలో రాణించాలి క్రీడా దాత జి శ్రీధర్ రెడ్డి ప్రముఖ న్యాయవాది

కర్నూలు, న్యూస్ వెలుగు; స్థానిక కర్నూల్ నగరం సమీపంలోని వెంకయ్య పల్లె దగ్గర సెయింట్ జోసెఫ్ మహిళ కళాశాల క్రీడా ప్రాంగణం నందు ఏర్పా టుచేసిన సీనియర్స్ కర్నూలు ఉమ్మడి జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ న్యాయవాది జి శ్రీధర్ రెడ్డి క్రీడా దాత కర్నూలు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతి రావు సెయింట్ జోసఫ్ మహిళా కళాశాల ప్రిన్సిపల్ రాజి హాజరయ్యారు ప్రముఖ న్యాయవాది జి శ్రీధర్ రెడ్డి క్రీడాదాత మాట్లాడుతూ స్త్రీ పురుషుల జట్లు ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు పశ్చిమగోదావరి జిల్లాలోని చిట్యాల లో 48వ స్త్రీ పురుషుల రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు టెన్ని కాయిట్ క్రీడ ఆడడం వలన చురుకుదనం మానసిక ఉల్లాసం దేహదారుఢ్యం మెరుగుపడతాయని ఆయన తెలిపారు స్నేహభావం క్రమశిక్షణ దేశ రక్షణ దేశ శ్రేయస్సు యువకులు సన్మార్గంలో ఉంటారని ఆయన తెలిపారు అలాగే జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు మాట్లాడుతూ* రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాను 2% నుండి 3% గా పెంచిందని విద్యార్థులు విద్యార్థి దశలోనే క్రీడలు ఆడడం వలన ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు సెయింట్ జోసెఫ్ కళాశాల ప్రిన్సిపల్ రాజి మాట్లాడుతూ నాకు క్రీడలు అంటే ఇష్టం కాబట్టి మా పాఠశాలలో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేశాను విద్యార్థులు ఆడుతూ ఉంటే మేము కూడా విద్యార్థులతో కలిసి ఆడాలని మాకు కూడా ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన తెలిపారు విద్యార్థులు ఉన్నత చదువుల్లో ఉద్యోగాలలో క్రీడలు ఆడడం వలన ప్రశంసా పత్రాలు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయురాలు శ్యామల, , వ్యాయామ ఉపాధ్యాయులు సురేష్, రవి ,గోకారి, సూరి , క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!