సర్వర్ డౌన్ సర్వర్ డౌన్ : కొత్తూరు సత్యం

సర్వర్ డౌన్ సర్వర్ డౌన్ : కొత్తూరు సత్యం

న్యూస్ వెలుగు, కర్నూలు; ప్రభుత్వాలు మారిన సర్వర్ డౌన్ సమస్య పరిష్కారం కావడం లేదని కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కొత్తూరు సత్యనారాయణ గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రోజుకు కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నప్పటికీ అధికారులు సక్రమంగా పట్టించుకోకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు గురవుతున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వానికి కోట్ల రూపాయలు ఆదాయం తెచ్చే రిజిస్ట్రేషన్ విషయంలో తరచూ అనేక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వాలు మారినప్పుడు నిబంధనలు మార్చడం వల్ల వినియోగదారులు అవస్థలు పడుతున్నారని ఆయన తెలిపారు. చాలామంది ముహూర్తాలు పెట్టుకుని మరీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కార్యాలయానికి వస్తుంటారని కానీ వచ్చిన ప్రతిసారి ప్రతిరోజు ఏదో సర్వర్ డౌన్ అంటూ సిబ్బంది ద్వారా వినడం బాధాకరమైన విషయం అన్నారు . గతంలో కూడా సర్వర్ సమస్యలతో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిందని నేడు అదే దుస్థితి ఏర్పడిందన్నారు. మీడియాలో కథనాలు వచ్చిన స్పందించి యంత్రాంగం లేదు.. ప్రభుత్వము లేదు.. ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు చెప్పేవారు లేరు అని ఆయన విమర్శించారు. స్లాట్ బుక్ చేసుకున్న వారు గంటల తరబడి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఎదురుచూపులు తప్పడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే సర్వర్ సమస్యలను పరిష్కరించాలని వినియోగదారుల ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. రిజిస్ట్రేషన్లు సక్రమంగా సజావుగా సాగితే ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు ఆదాయం వస్తుందని కానీ ఇటువంటి ఆదాయాన్ని ఇచ్చే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సర్వర్ డౌన్ కావడం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తే విడ్డూరంగా ఉందని ఆయన తెలిపారు. సాంకేతిక సమస్యలతో రిజిస్ట్రేషన్ సేవలకు ఆటంకం ఏర్పడుతుందని క్రయవిక్రయదారులు విసిగిపోతున్నారని, వద్దురా బాబు రిజిస్ట్రేషన్ అంటూ కన్నీరు పెట్టుకోక తప్పదు అన్నారు .ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఉన్న ఆస్తుల అమ్ముకోవడానికి కూడా వీలులేని విధంగా ప్రభుత్వాలు ఉండడం బాధాకర విషయం సిగ్గుచేటు అన్నారు . రిజిస్ట్రేషన్ సేవలు పెండింగ్లో పడిపోతున్నాయి.. శాశ్వత పరిష్కారం చూపాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారని , ప్రభుత్వం వెంటనే స్పందించి రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!