
గ్రామసభల ద్వారా రైతుల భూ సమస్యల పరిష్కారం
తహశిల్దార్ సతీష్ కుమార్
హోళగుంద, న్యూస్ వెలుగు: రైతుల సమస్యల పరిష్కారమే రెవెన్యూ గ్రామ సభల ధ్యేయమని తహసిల్దార్ సతీష్ కుమార్ అన్నారు.శుక్రవారం మండల పరిధిలోని పెద్దగోనెహల్ గ్రామంలో రీ సర్వేలో వచ్చిన భూ సమస్యల పరిష్కారానికి గ్రామ సభ నిర్వహించారు.ఈ గ్రామ సభలో రైతుల నుంచి భూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులను స్వీకరించారు.వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకటరెడ్డి,డిప్యూటీ తహసిల్దార్ నిజాముద్దీన్,రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ ముకుందరావు,వీఆర్వోలు ప్రహ్లాద,నాగరాజు,సురంజినేయులు,దామోదర,విలేజ్ సర్వేయర్లు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!