రెవిన్యూ సదస్సు ద్వారా రైతుల భూ సమస్యల పరిష్కారం
ప్రత్యేక అధికారి డి పి ఓ విజయ భాస్కర్
హోళగుంద, న్యూస్ వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెవిన్యూ సదస్సు ద్వారా రైతుల సమస్యలు పరిష్కారం సాధ్యమవుతాయని రెవిన్యూ సదస్సు ప్రత్యేక అధికారి మరియు డీపీఓ విజయ భాస్కర్,డిప్యూటీ తహసీల్దార్ నిజాముద్దీన్ అన్నారు.శుక్రవారం మండల పరిధిలోని చిన్నహ్యట గ్రామంలో రెవిన్యూ సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు తమ భూమిలకు సంబంధించి ఏమైనా సమస్య ఉంటే రెవెన్యూ సదస్సులో తమ అర్జీని అందిస్తే భూ సమస్యను పరిష్కరిస్తామన్నారు.రీ సర్వేలో వచ్చిన భూ సమస్యల పరిష్కారానికి రెవిన్యూ సదస్సు నిర్వహించడం జరిగిందన్నారు.సమావేశం వచ్చిన అర్జీలను పరిశీలించి త్వరితగతిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.సమావేశంలో 7 మంది రైతులు అర్జీలు సమర్పించారని,రైతులకు తిరిగి రిసిప్ట్ అందజేసినట్లు తెలియజేశారు.అదేవిధంగా గ్రామంలో కుక్కల బెడద నివారించాలని సర్పంచ్ హేసనుల్లా వినంతి పత్రం సమర్పించారు.అనంతరం డీపీఓ,డిప్యూటీ తహసీల్దార్, ఈఓపీఆర్డిని సర్పంచ్ హేసనుల్లా,డిఎస్ భాష శాలువ పూలమాలలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డి చక్రవర్తి,పంచాయితీ కార్యదర్శులు రాజశేఖర్,నాగరాజు,దేవదాయ శాఖాధికారి నరేంద్ర,వీఆర్వోలు ప్రహ్లాద,దామోదర, పంచాయతీ సెక్రెటరీ రాజశేఖర్ గౌడ నాగరాజా ఫారెస్ట్ అధికారులు,విలేజ్ సర్వేయర్లు,గ్రామ సేవకులు,గ్రామ ప్రజలు రైతులుతదితరులు పాల్గొన్నారు.