ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి సీట్లు కేటాయించాలి
కర్నూలు, న్యూస్ వెలుగు; నిత్యం వలసలకు నిలయంగా మారిన కర్నూలు జిల్లాలో అమ్మాయిలు తమ చదువును కొనసాగించాలంటే తల్లిదండ్రులకు పెద్ద భారమైపోయిందని ఎస్ఎఫ్ఐ జిల్లా

అధ్యక్షకార్యదర్శి అబ్దుల్లా, రంగప్ప అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని సమగ్ర శిక్ష ప్రాజెస్ట్ అధికారి శ్రీనివాసులకు కస్తూరిబా గాంధీ విద్యాలయాలలో చదువుకోవడం కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి సీట్లు ఇవ్వాలని వినతిపత్రం ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ పేద మధ్యతరగతికి చెందినటువంటి ప్రజలు ఆర్ధిక స్తోమత లేకపోవడం వల్ల ప్రైవేట్ హాస్టల్లో ఉంచి అమ్మాయిలకు చదువులు చెప్పించలేకపోతున్నారు. అలాగే ప్రభుత్వ కెజిబివిలో ఉచితంగా చదివిద్దాం అంటే వేల సంఖ్యలో విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకుంటే కేవలం 40 సీట్లు మాత్రమే భర్తీ చేయటం వల్ల మిగతా విద్యార్థులు చేసేది ఏమీ లేక చాలా మంది అమ్మాయిలు వారి చదువును మధ్యలోనే వదిలేసి తల్లిదండ్రులతో కలసి సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు. అలాగే చిన్న వయసులోనే వివాహాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఈ విద్యా సంవత్సరం మన జిల్లాలోని కెజిబివి చదువుకోవాలనే ఆసక్తి ఉన్న అమ్మాయిలందరికీ విద్యను అందించటం ప్రభుత్వం బాధ్యతగా గుర్తించి, భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొనే ప్రతి అమ్మాయికి కెజిబివి చదువుకొనేలా సీట్లు పెంచి అమ్మాయిల పురోభివృద్ధికి దోహదపడాలని డిమాండ్ చేశారు.
Thanks for your feedback!