ఘనంగా ప్రారంభమైన శవాసప్పా స్వామి ఉరుసు

ఘనంగా ప్రారంభమైన శవాసప్పా స్వామి ఉరుసు

     భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు ఏర్పాటు

తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండల పరిధిలోని గల చెన్నంపల్లి గ్రామం నందు శవాసప్పా స్వామి ఉరుసును శుక్రవారం రోజున నిర్వాహకులు,గ్రామ పెద్దలు,ప్రజల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు.శుక్రవారం రోజున స్వామివారికి గంధం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.శనివారం రోజున షంషేర్,ఆదివారం రోజున జియారత్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు.శవాసప్ప స్వామి ఉరుసు మహోత్సవానికి విచ్చేయు భక్తుల కొరకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు గ్రామ సర్పంచ్ రంగమ్మ,సర్పంచ్ గౌరవ సలహాదారుడు వెంకటపతి లు తెలియజేశారు.భక్తులు శవాసప్ప దర్గా నందు స్వామిని దర్శించుకుని తమ మొక్కులను తీర్చుకుంటున్నారు.ఈ కార్యక్రమంలో నిర్వాహకులు,గ్రామ పెద్దలు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.ఉరుసు వేడుకలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జొన్నగిరి ఎస్సై జయ శేఖర్ గౌడ్ తమ పోలీసులతో కలిసి ప్రతిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!