
ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆస్పత్రిలో మందుల కొరత
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్యాజువాలిటీ, మరియు అత్యవసర విభాగాలలో మందుల కొరతపై ఆరా తీశారు అనంతరం ఆసుపత్రిలోని పలు రకాల మందులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. 
1.క్యాజువాలిటీ , ఎమర్జెన్సీ విభాగాలలో మందుల కొరత లేదు ఎమర్జెన్సీ మెడిసిన్ కొరకు దానికి సంబంధించిన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నామన్నారు పేషంట్ కి అవసరమైన మందులు ఇవ్వడానికి ఆసుపత్రి నందు అందుబాటులో ఉన్నాయని అన్నారు కొన్ని మందు లేని వాటిపై లోకల్ పర్చేజ్ లో మందులన్నీ కొనుగోలు చేశాము పీఎంబిజెకె ద్వారా మరియు లోకల్ ఏజెన్సీ నుంచి అన్ని అత్యవసర మందులు కొనుగోలు చేసినట్లు తెలిపారు మందుల కొరత ఎలాంటి సమస్య లేదు అన్ని రకాలుగా మందులు అందుబాటులో ఉన్నాయన్నారు.
2.ఆసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు రోగులు క్షతగాత్రులు అత్యవసర విభాగానికి వస్తే వారిని ఎక్స్రేకు, స్కానింగ్కు తీసుకెళ్లేందుకు స్ట్రెచర్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు.
3.న్యూ డయాగ్నోస్టిక్ సెంటర్లో వైద్యపరీక్షల కొరకు హెల్ప్ డెస్క్ అందుబాటులో పెట్టామని అన్నారు. 
4.ఆసుపత్రిలోని అవసరమైన మందులు అందుబాటులు ఉన్నాయి, ఎవరైనా బయటికి రాస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
5.రోగులు ఏమన్నా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొస్తే దానికి వెంటనే పరిష్కరిస్తానని అన్నారు.


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar