సత్ప్రవర్తన కలిగి ఉండాలి:- సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబు

సత్ప్రవర్తన కలిగి ఉండాలి:- సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబు

న్యూస్ వెలుగు, ఒంటిమిట్ట; మండల కేంద్రమైన ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఆదివారం సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబు నేరస్థులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. నేరస్థులను తన కార్యాలయానికి పిలిచి సత్ప్రవర్తలతో భయ భక్తులతో జీవించాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. సాధారణంగా ప్రతి మనిషి తెలిసో, తెలియకో, పరిస్థితుల ,సందర్భాల ప్రభావమో తప్పులు చేస్తాడని జీవితాంతము అదే రీతిలో జీవించకుండా తమ కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రవర్తనను మార్చుకొని ఎటువంటి తప్పులు చేయకుండా కష్టపడి శ్రమించి తమ కుటుంబాలను పోషించుకుంటూ అసలైన మార్పుతో నీతి నిజాయితీగా జీవించి పరోపకారిగా మారాలన్నారు. లేనిపక్షంలో ప్రభుత్వ పరంగా తగిన శిక్షలు తప్పమన్నారు. దొంగతనాలు, కొట్లాటలు, మట్కా, జూదం వంటి అసాంఘిక చర్యలకు పాల్పడినట్లయితే వారి పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి జైల్లోకి పంపడం జరుగుతుందన్నారు. కావున తప్పు మీద తప్పులు చేస్తూ తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సత్ప్రవర్తనతో పదిమందికి సహాయం చేస్తూ సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన నేరస్తులకు హితువు పలికారు. ఈ కౌన్సిలింగ్ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!