ప్రారంభమైన శ్రీ సిద్దేశ్వర స్వామి జాతర ఉత్సవాలు

ప్రారంభమైన శ్రీ సిద్దేశ్వర స్వామి జాతర ఉత్సవాలు

హోళగుంద, న్యూస్ వెలుగు: మండల ప్రజల ఆరాధ్య దైవం,స్వయంభువుగా వెలసిన సిద్దేశ్వర స్వామి జాతర ఉత్సవాలు ఆదివారం ఆలయ ధర్మకర్త రాజా పంపన్న గౌడ,సోదరుడు శివశంకర్ గౌడ ఆధ్వర్యంలో కంకణధారతో ప్రారంభమైయ్యాయి.ఇందులో భాగంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వామి అమ్మ వార్లకు నిర్చ్తర్థం,కంకణాధారణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.అలాగే స్వామి వారి ఉత్సవాలు 9వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు.ఇందులో భాగంగా 5న నంది ఉత్సవం,6న గజోత్సవం,7న మహా రథోత్సవం,8న లంకదహన కార్యక్రమం,9న వసంతోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు.అలాగే ఉత్సవాలకు అన్ని ఏర్పాటు చేపడుతామని తెలియజేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!