
భక్తిశ్రద్ధలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి బింద సేవ సేవా కార్యక్రమం
ఒంటిమిట్ట, న్యూస్ వెలుగు; దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రమైన ఒంటిమిట్ట మెయిన్ బజార్ లో ఉన్న అమ్మవారి శాలలో బుధవారం ఏడవ రోజు మండల పురోహితులు, అమ్మవారి శాల అర్చకులు ఏలేశ్వరం. గురుస్వామి శర్మ ఆధ్వర్యంలో ఉదయం అదనపు అర్చకులు రామావజుల. శ్రీకాంత్ శర్మ, ఏలేశ్వరం. బాల గురునాథ శర్మ, ఏలేశ్వరం. గురు దీక్షిత్ శర్మ,కన్యకా పరమేశ్వరి మాతకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా మహాగణపతి పూజ, పంచపాలక ,అష్టదిక్పాలక, నవగ్రహ, అమ్మవారి ప్రధాన కలిశ మంటపారాధన, అమ్మవారి మూల,ఉత్సవ వరులకు పురుష సూక్త, లక్ష్మీ సూక్త ప్రకారంగా శాస్ట్రోక్తంగా పంచామృత అభిషేకాలు, నూతన వస్త్రధారణ, కనక భూషణ పుష్పతరువులతో ప్రత్యేక అలంకరణ, ఉభయ దారుల ఆధ్వర్యంలో సహస్రనామార్చన, అష్టోత్తర కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం అత్యంత భక్తిశ్రద్ధలతో ఆర్యవైశ్య యువకులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి బింద సేవా కార్యక్రమం చేపట్టారు. అనంతరం అమ్మవారికి మహా నివేదన,మంగళహారతి తీర్థ ప్రసాద వినియోగము నిర్వహించడం జరిగింది. ఆర్యవైశ్యులు భక్తిశ్రద్ధలతో ఆలయానికి వచ్చి అర్చకులు అమ్మవారికి నిర్వహించే పూజా కార్యక్రమాల్లో పాల్గొని మంగళ హారతి తీర్థప్రసాదాలు స్వీకరించారు.