సార్ న్యాయం చేయండి

సార్ న్యాయం చేయండి

కర్నూల్ నగరానికి చెందిన నిరుద్యోగి సురేష్ ఆవేదన

ప్రభుత్వ స్థలంలో వ్యాపారం చేసుకుంటుంటే తనపై దౌర్జన్యం చేస్తున్నారు

కర్నూలు, న్యూస్ వెలుగు; సార్ న్యాయం చేయండి. నాపై దౌర్జన్యం చేస్తున్నారని కర్నూల్ కు చెందిన నిరుద్యోగి సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తాను పీజీ చదువుకున్నానని ఉద్యోగ అవకాశాలు లేక వ్యాపారం చేసుకుంటున్నానన్నాడు. కర్నూల్ నగరంలోని సి. క్యాంప్ రైతు బజార్ దగ్గర మున్సిపాలిటీ స్థలంలో గత మూడు సంవత్సరాలుగా టెంకాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న అన్నారు. మున్సిపాలిటీ వారికి పన్ను కూడా కడుతున్నట్లు తెలిపారు. కానీ ఇప్పుడు కొందరు వచ్చి తన షెడ్డును కూల్చి వేయడం జరిగిందని తనపై  దౌర్జన్యం  చేస్తున్నారని ఆరోపించారు. అధికార స్పందించి తన న్యాయం చేయాలని తనకు వ్యాపారం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని సురేష్ కోరారు. మున్సిపాలిటీ స్థలంలో జెమిని చికెన్ సెంటర్ వారు అనేక చోట్ల స్థలాలను ఆక్రమించుకొని రెంట్లకు ఇస్తున్నారని తెలిపారు. ఇప్పుడు 3000 ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారని  అన్నారు. వారిపై చర్యలు తీసుకుని తన న్యాయం చేయాలని కోరారు. తనకు జీవనాధారం వ్యాపారమే అని వ్యాపారం చేసుకోకపోతే తనకు కుటుంబం గడవదన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కమిషనర్ స్పందించి తన న్యాయం చేయాలని కోరారు.

Author

Was this helpful?

Thanks for your feedback!