
సీతారాముల దేవస్థానం రోడ్డుకు మహర్దశ
* సి.సి రోడ్డు నిర్మాణానికి పనులు ప్రారంభం
* రోడ్డు పనులను పర్యవేక్షించిన టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర
తుగ్గలి, న్యూస్ వెలుగు:మండల కేంద్రమైన తుగ్గలిలో సీ.సీ రోడ్ల నిర్మాణానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు శ్రీకారం చుట్టారు.తుగ్గలి గ్రామంలో సీతారాముల దేవాలయం వద్ద నుండి బెంగళూరు-మంత్రాలయం మెయిన్ రోడ్డు వరకు సుమారు 160 మీటర్లు సీ.సీ రోడ్డు నిర్మాణానికి 5 లక్షలు ఎన్ఆర్జిఎస్ నిధులతో,5 గ్రామ పంచాయతీ నిధులతో సి.సి రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, అదేవిధంగా మెయిన్ రోడ్డుకు 5 లక్షల నిధుల మండల గ్రాండ్ తో సైడ్ కాలువను ఏర్పాటు చేయడం జరుగుతుందని,ఈ పనులను టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర సమక్షంలో చేపట్టడం జరుగుతుందని పంచాయతీరాజ్ ఏఈ వెంకటేశ్వర్లు తెలియజేశారు.ఈ సందర్భంగా సి.సి రోడ్డు నిర్మాణపు పనులను సర్పంచ్ గౌరవ సలహాదారులు తుగ్గలి నాగేంద్ర,గ్రామ సర్పంచ్ రవి లు పరిశీలించారు.ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర మాట్లాడుతూ పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు చొరవతో సీ.సీ రోడ్ల నిర్మాణం పనులు త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు.అదేవిధంగా గ్రామంలో పెండింగ్ ఉన్న రోడ్డు పనులను కూడా త్వరలో ప్రారంభిస్తామని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామాంజనేయులు, టిడిపి పార్టీ మైనార్టీ నాయకులు అల్లా బకాష్, హయత్ భాష,ఆకుల శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ పుల్లన్న,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.