
రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడేది ఎప్పుడో
కర్నూలు, న్యూస్ వెలుగు; బనగానపల్లె నియోజకవర్గం లో రేషన్ బియ్యం అక్రమ రవాణా చాప కింద నీరులా విస్తరిస్తోంది. పేదవాడి ఆకలి తీర్చడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయల ఖర్చుపెట్టి ప్రజలకు రేషన్ షాపుల ద్వారా బియ్యాన్ని నిరుపేదలకు పంపిణీ చేస్తున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసేవాళ్లు గ్రామానికి ఇంతమందిని ఏర్పాటు చేసుకొని ప్రజలనుండి పడి బియ్యం 20 నుండి 25 రూపాయలు కొనుగోలు చేసి రేషన్ బియ్యాన్ని అక్రమంగా వాహనాలలో బేతంచెర్ల పట్టణానికి తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బనగానపల్లె నియోజకవర్గం లో స్థానికంగా ఉన్నవారికి ఎంతో కొంత రోజువారి కూలి ఇచ్చి రేషన్ బియ్యాన్ని సేకరించి వాహనాలలో తరలించి అక్కడి నుండి కర్ణాటక నెల్లూరు ఇంకా సుదూర ప్రాంతాలకు రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నట్లు ప్రజల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట ఎప్పుడు పడుతుందోనని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. బేతంచెర్ల పట్టణంలో కొంతమంది అక్రమ రేషన్ బియ్యం వ్యాపారస్తులు అక్కడే స్థానికంగా ఏర్పడి బనగానపల్లె నియోజకవర్గం నుండి రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు గానీ ఇంకా పోలీస్ అధికారులు కానీ అక్రమ రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు అధికారులను కోరుతున్నారు.