భూ సమస్యలు పరిష్కరిక వేదిక ఇది : తహసిల్దార్
తహసిల్దార్ పద్మావతి
సంతజూటూరు గ్రామంలో రెవిన్యూ సదస్సు
బండి ఆత్మకూరు, వెలుగు న్యూస్: గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలను పరిష్కరించుకోవాలని బండి ఆత్మకూరు తాసిల్దార్ పద్మావతి అన్నారు.మండలంలోని సంతజూటూరు గ్రామంలో శుక్రవారం రెవిన్యూ సదస్సు నిర్వహించారు.ఈసందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ గ్రామాలలో దీర్ఘకాలంగా ఉన్న భూసమస్యలు, వివాదాలు పరిష్కరించటమే రెవెన్యూ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రజలు తమ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ప్రజల వద్దకే అధికారులు వచ్చి వారి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. రైతులుకు ఏమైన భూసమస్యలు ఉంటేఈసదస్సుల ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు.అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గ్రామంలో రైతుల నుండి 6 అర్జీలు వచ్చాయన్నారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రెహమాన్, మండల సర్వేయర్ పర్వీన్, వీఆర్వో నాగేశ్వరరావు, టిడిపి నాయకుడు మహేశ్వర్ రెడ్డి,సంతజూటూరు చందనపు చెరువు అధ్యక్షుడు భూమ రామలింగారెడ్డి, తెలుగుగంగ డబ్ల్యూఏ అధ్యక్షుడు ముమ్మడి నాగ శేషారెడ్డి, చెరువు ఉపాధ్యక్షుడు శివరాంరెడ్డి, భూమ మహేష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.