
బాలికల సంక్షేమ హాస్టల్ లో సమస్యలు పరిష్కరించండి ; SFI
డ్యూటీ సమయంలో విధుల్లో లేని వార్డెన్లపై చర్యలు తీసుకోవాలి. సంయుక్త ఎస్ఎఫ్ఐ జిల్లా గర్ల్స్ కన్వీనర్.
న్యూస్ వెలుగు, కర్నూలు; భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కమిటీ సమావేశం ఎస్ఎఫ్ఐ ఆఫీసులో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా గర్ల్స్ కన్వీనర్ సంయుక్త మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఉన్న బాలికల సంక్షేమ హాస్టల్లో మౌలిక సమస్యలు పరిష్కరించాలి. నిత్యం కస్తూరిబా హాస్టల్ లో విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. జిల్లా ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు దుర్భరంగా తయారయ్యాయి. కనీస వసతులు లేక విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సంక్షేమ హాస్టల్ పరిసరాలలో విషపురుగులు, పాములు సంచరిస్తున్నాయి. సంక్షేమ హాస్టల్ లో ఉండాలంటే విద్యార్థులు భయాందోళన చెందే పరిస్థితుల్లో హాస్టల్లు పరిస్థితులు ఉన్నాయి. ఎస్ఎఫ్ఐ గర్ల్స్ బృందం హాస్టల్లో పర్యవేక్షణకు వెళ్తే హాస్టల్లో వార్డెన్లు సమయానికి డ్యూటీలో లేకపోవడం జరుగుతుంది. డ్యూటీలో లేని వార్డెన్లపై చర్యలు తీసుకోవాలి. మెనూ ప్రకారం భోజనం విద్యార్థులకు పెట్టడం లేదు. విద్యార్థినీలకు అనారోగ్యం గురవుతే సమయానికి హాస్పిటల్కు తీసుకుపోయే వాళ్లు హాస్టల్లో లేరు. వార్డెన్లు హాస్టల్లో సమయానికి ఉండడం లేదు. ఇప్పటికైనా విద్యార్థినీయుల సంక్షేమ హాస్టల్లో సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాము. సందర్భంగా గర్ల్స్ నాయకులు రేవతి, తులసి, మౌనిక, అక్షయ పాల్గొన్నారు.