హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రం నుండి వన్నూరు క్యాంప్ వరకు నూతన రోడ్డు నిర్మాణం పనులు జరుగుతున్నాయి.

అయితే 56వ ఆయకట్టు (డి.పి) రోడ్డు మార్గంలో ఉంది.ఆయకట్టు (డీ.పీ) లోపలి భాగంలో రాళ్లు ముళ్ళ కంపలు చెత్తచెదారం నిండుకొని ఆయకట్టుకు ప్రవహిస్తున్న నీరు పైపు రంధ్రాల ద్వారా నీరు బయటకు వస్తున్నాయి.దీంతో ప్రజలకు,రైతులకు,రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా మారింది.అదేవిధంగా పక్కనే ఉన్న రైతు పంట పొలాల్లోకి డీపీ నీరు చేరుకొని పంటలు దెబ్బ తినకముందే సమస్యను పరిష్కరించాలని అధికారులను,కాంట్రాక్టర్లను రైతులు ప్రజలు కోరారు.అనంతరం ఈ విషయం తెలుసుకున్న 56వ ఆయకట్టు (డి.పి) మెంబర్ రారాయి యల్లప్ప మరియు రైతులు ప్రజలు అక్కడికి చేరుకొని అధికారులకు కాంట్రాక్టర్లకు విషయం తెలియజేశారు.ఇందుకు అధికారులు సానుకూలంగా స్పందిస్తూ మీ సమస్యను వెంటనే పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆర్.లక్ష్మణ,జంబపుర బసవ,శరణ,టిడిపి యువ నాయకులు రారాయి సిద్దు,ఎస్.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Thanks for your feedback!