
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆసుపత్రి లో త్వరలో యాక్షన్ ప్లాన్
కర్నూలు, న్యూస్ వెలుగు; ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నూతన సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించినందుకు పలువురు వైద్యులు ఆసుపత్రి సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది, ఇతర సిబ్బంది మరియు రాజకీయ నాయకులు తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి వారు శుభాకాంక్షలు తెలియజేసినట్లు తెలిపారు. ఆసుపత్రిలో పలువురు వైద్యులు ఆసుపత్రి సిబ్బంది నా దృష్టికి కొన్ని సమస్యలు వారు తీసుకొచ్చారు వాటికి త్వరలో కార్యాచరణ రూపొందించి వీలైనంత వాటికి పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది సమయపాలన ఉండి ప్రతి ఒక్కరు వారి యొక్క విధులను ఆచరించి సక్రమంగా నిర్వహించాలని వారికి సూచించినట్లు తెలిపారు.ఆసుపత్రిలో త్వరలో యాక్షన్ ప్లాన్ రూపొందించి పలు విభాగాలకు ఆకస్మిక తనిఖీ చేస్తాను అని అన్నారు.ఆసుపత్రిలో అన్ని విభాగాలకు సంబంధించిన ప్రపోజల్స్ తీసుకొని ఆయా విభాగాలకు సంబంధించిన అభివృద్ధి పనులను త్వరలో చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి కేఎంసీ వైస్ ప్రిన్సిపల్, డా.హరిచరణ్, రేడియాలజీ విభాగాధిపతి, డా.రాధారాణి, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్, డా. లక్ష్మీబాయి, యురాలజీ హెచ్ ఓ డి, డా.సీతారామయ్య, అనస్తీసియ హెచ్ ఓ డి, డా.విశాల, ఆర్ ఇ హెచ్ సూపరిండెండెంట్, డా.పృద్వి వెంకటేశ్వర్లు, డిప్యూటీ సి ఎస్ ఆర్ ఎమ్, డా.హేమనలిని, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివ బాల నగాంజన్, APMSIDC ఈ ఈ, శ్రీ.శివకుమార్, తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు తెలిపారు.