పారిశ్రామిక అభివృద్దికి ప్రత్యేక టాస్క్ పోర్స్

పారిశ్రామిక అభివృద్దికి ప్రత్యేక టాస్క్ పోర్స్

అమరావతి :  రాష్ట్రానికి పెట్టుబడుల సాధనకు, వేగవంతమైన పారిశ్రామికాభివృద్ది సాధించేందుకు సీఎం చంద్రబాబునాయుడు ప్రణాళికలు రచిస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన కోసం వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థల ఏర్పాటుకు చంద్రబాబు చర్చలు జరిపారు. ఇందులో భాగంగా పారిశ్రామికాభివృద్దికి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. స్వర్ణాధ్రప్రదేశ్ – విజన్ 2047 రూపకల్పనపై సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, పారిశ్రామికాభివృద్దికి ప్రణాళికలు అందించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు CMO వర్గాలు వెల్లడించాయి. ఈ టాస్క్ ఫోర్స్ లో దేశంలో పేరున్న పారిశ్రామికవేత్తలు, బిజినెస్ సెక్టార్ ప్రముఖులు, ఆయా రంగాల్లో నిపుణులు ఉండడనున్నారు. ఈ టాస్క్ ఫోర్స్ కు ముఖ్యమంత్రి చైర్మన్ గా, ప్రముఖ వ్యాపార సంస్థ అయిన టాటా గ్రూపు చైర్మన్ చంద్రశేఖరన్ కో చైర్మన్ గా వ్యవహరించనున్నారు. సచివాలయంలో టాటా చైర్మన్ తో భేటీ సందర్భంగా ఈ అంశంపై చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై చర్చించారు. ప్రత్యేకమైన విజన్ ద్వారా 2047 నాటికి ఎపిని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో విజన్ ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తోంది. దీనిలో భాగంగా పారిశ్రామికాభివృద్దికి చేపట్టాల్సిన చర్యలపై టాస్క్ ఫోర్స్ పనిచేస్తుందని టిడిపి వర్గాలు వెల్లడించాయి . విశాఖలో టీసీఎస్ డెవల్మెంట్ సెంటర్ ఏర్పాటు, రాష్ట్రంలో ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్ లైన్స్ విస్తరణ తో పాటు పలు అంశాలపై టాటా గ్రూప్ చైర్మన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోన్న సోలార్ పవర్, టెలీకమ్యునికేషన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపైనా టాటా గ్రూప్ చైర్మన్ తో సీఎం చంద్రబాబు చర్చించారు. ఈ కార్యక్రమంలో సిఎం చంద్రబాబు , విద్యాశాఖ  , మంత్రి లోకేష్  , పరిశ్రమల శాఖ మంత్రి  టిజి భారత్ పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS