
క్రీడాకారులు స్నేహభావంతో మెలగాలి
మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, రాష్ట్ర ఒలంపిక్స్ సంఘం అధ్యక్షుడు పురుషోత్తం
న్యూస్ వెలుగు, కర్నూలు; క్రీడాకారులు అంకితభావంతో పోటీల్లో పాల్గొంటేనే విజేతలుగా నిలుస్తారని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, రాష్ట్ర ఒలంపిక్స్ సంఘం అధ్యక్షుడు పురుషోత్తం లు అన్నారు.శనివారం దినదేవరపాడు సమీపంలోని కేఈ నివాసంలో 50వ రాష్ట్రస్థాయి జూనియర్ బాలబాలికల కబడ్డీ రెండవ రోజు పోటీలను వారు ముఖ్య అతిథిలుగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ తనకి సంవత్సరాలుగా రాష్ట్రంలో కబడ్డీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నానని అన్నారు. క్రీడాకారులు గెలుపు ఓటమిలను సమానంగా తీసుకొని పోటీల్లో రాణించాలన్నారు. అనంతరం రాష్ట్ర ఒలంపిక్ సంఘం అధ్యక్షులు పురుషోత్తం మాట్లాడుతూ మూడు రోజులపాటు జరిగే ఫిదా స్ఫూర్తిని ప్రదర్శించి విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు.కబడ్డీ అభివృద్ధి కోసం కేఈ ప్రభాకర్ నిరంతరం కృషి చేయడం ప్రశ్నించేదగ్గ విషయం అన్నారు.లైట్ వెల్తురులో పోటీలు నిర్వహించడం అభినందనీయం అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు,కర్నూలు జిల్లా ఒలంపిక్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు కేఈ జగదీష్ కుమార్,శ్రీనివాసులు,రాష్ట్ర
కబడ్డీ సంఘం కార్యదర్శి కుమారి పద్మజ బాల,రాష్ట్ర జూడో సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీధర్,రాష్ట్ర యోగ సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ శెట్టి,జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్ష కార్యదర్శులు మల్లికార్జున రెడ్డి,శుభకర్ , రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.