
కర్నూలులో ఘనంగా శ్రీ భక్త కనకదాసు జయంతి వేడుకలు
కర్నూలు, న్యూస్ వెలుగు; జిల్లా కేంద్రంలోని బీసీ భవన్ నందు శ్రీ భక్త కనకదాసు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జిల్లా పరిషత్ హాల్లో బీసీ వెల్ఫేర్ అ ధికారిని వెంకట లక్ష్మమ్మ అధ్యక్షతన ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పాల్గొని ఆ కార్యక్రమంలో కురువ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోశ్రీ భక్త కనకదాసు విగ్రహాలకు స్థలాలు కేటాయించి అలాగే కనకదాసు భవనాలు నిర్మాణానికి స్థలాలు కేటాయించాలని జిల్లా కేంద్రంలోని కనకదాసు విగ్రహం ఏర్పాటుకు వై జంక్షన్ ను కనకదాసు జంక్షన్ గా పేరు మార్చి అక్కడ విగ్రహం పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని, గొర్రెలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని 90 శాతం సబ్సిడీపై గొర్రెల మేకలు ఇవ్వాలని రాష్ట్రంలోనే ప్రధాన దేవాలయాలైన తిరుపతి,శ్రీశైలం, అహోబిలం, విజయవాడ తదితర పుణ్యక్షేత్రాలలో కనకదాసు భవనాలు నిర్మించాలని కనకదా జయంతిని అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి దేవేంద్ర కోశాధికారి కర్నూలు జిల్లా కురువ సంఘం నాయకులు కేసీ నాగన్న మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అనిత కుంటనహల్ సర్పంచ్ శివరాం బూదూర్ లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.