
హరిజనులను దేవాలయ ప్రవేశింప చేసిన ఘనుడు శ్రీ పొట్టి శ్రీరాములు : కొత్తూరు సత్యం
న్యూస్ వెలుగు, కర్నూలు; హరిజనులను దేవాలయంలోకి ప్రవేశింపజేసిన ఘనుడు ఉద్యమ నాయకుడు శ్రీ పొట్టి శ్రీరాములు అని కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కొత్తూరు సత్యనారాయణ గుప్త తెలిపారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు హరిజనులకు దేవాలయంలో ప్రవేశం లేదని ఇది అన్యాయమని భావించి మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఉద్యమాలు చేసి నిరసన తెలిపి, హరిజనలను దేవాలయంలోకి ప్రవేశింపజేయడం ఆయనకు ఆయనే సాటి అన్నారు .కానీ పొట్టి శ్రీరాములు వైశ్య కులంలో పుట్టిన ఇతర కులాలను గౌరవిస్తూ అభిమానిస్తూ వారికి అన్యాయం జరిగితే ప్రతిఘటన జరిగిందన్నారు. నేడు వైశ్యులకు అవమానం జరిగిన నిందలు పడిన వైశ్యులకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడే నాయకుడు లేడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలలో గాని వివిధ రాజకీయ పార్టీలు పదవులు లభించడంలో గాని అన్యాయం జరుగుతుందని అవమానాలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికి చెప్పుకోలేక లోలోన మదనపడుతూ మా బతుకులు ఇంతే అంటూ కృంగిపోతున్నారన్నారు . పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలను పొట్టి శ్రీరాములు జిల్లాగా చేయాల్సింది పోయి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం జరిగిందన్నారు. అయితే కడప జిల్లాను వైయస్సార్ జిల్లాగా ప్రకటించడం జరిగిందని తెలిపారు. కులం గొప్ప అభివృద్ధి దిబ్బ అన్న భావన వైశ్యుల్లో నెలకొని ఉందని ఆయన తెలిపారు.


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar