
ముగిసిన శ్రీ సిద్దేశ్వర స్వామి జాత్ర ఉత్సవాలు
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో స్థానిక కొండ గుహలో స్వయంభువుగా వెలసిన శ్రీ సిద్దేశ్వర స్వామి జాత్ర ఉత్సవాలు ఆదివారం వసంతోత్సవంతో వైభవంగా ముగిశాయి.ప్రధానంగా చివరి రోజు అయిన ఆదివారం శ్రీవారి సన్నిధిలో స్వామివారికి ఉదయం నుంచి వంశపారంపర్యం ఆలయ ధర్మకర్త రాజా పంపన్న గౌడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే సాయంత్రం స్వామి వారి ఆలయం నుంచి కొట్టురు బసవేశ్వర స్వామి దేవాలయం వరకు స్వామివారి ఉత్సవ విగ్రహ మూర్తులను పూల పల్లకిలో ఉంచి,మేళా తాళతో, సకల వాయిద్యాల నడుమ పురవిధుల గుండా ఊరేగింపుగా తరలి వెళ్లారు.అనంతరం స్థానిక బస్టాండ్ నందు గల కళ్యాణ మంటపంలో స్వామివారి పల్లకిని ఉంచి స్వామివారి ఉత్సవ విగ్రహా మూర్తిని పెద్ద బావికి తీసుకెళ్లి అక్కడ జలభిషేకం చేసి మహామంగల హారతి సమర్పించి తదనంతరం టపాసులు కాల్చి స్వామివారి పూల పల్లకిని అర్చకుల ఇంటికి చేర్చారు.ఈ కార్యక్రమంలో శివశంకర్ గౌడ,అమర గౌడ,సిద్దార్థ్ గౌడ తదితరులు పాల్గొన్నారు.