శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అలంకార రూపినిగా శ్రీ వాసవాంబ
ఒంటిమిట్ట, న్యూస్ వెలుగు; దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రమైన ఒంటిమిట్ట మెయిన్ బజార్ లో ఉన్న అమ్మవారి శాలలో గురువారం ఉదయం మండల పురోహితులు, కోదండ రామాలయ ఆస్థాన పురోహితులు, అమ్మవారి శాల అర్చకులు అయిన ఏలేశ్వరం .గురుస్వామి శర్మ ఆధ్వర్యంలో అదనపు అర్చకులు రామావజ్జుల శ్రీకాంత్ శర్మ, ఏలేశ్వరం. బాల గురునాథ శర్మ, ఏలేశ్వరం. గురు దీక్షిత్ శర్మ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా మహా గణపతి పూజ, పంచపాలక, అష్టదిక్పాలక, నవగ్రహ, సప్త మాతృక, వాస్తు కలిస, వాసవి కన్యకా పరమేశ్వరి మహా కలిస షోడశోపచార పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం మహర్నవమి సందర్భంగా వాస్తు, వాసవి కన్కాపరమేశ్వరి సహస్రనామ, ఆదిత్యాది నవగ్రహ, అమ్మవారి మూల మంత్ర హోమ కార్యక్రమాలు అర్చకులు దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. అనంతరం పూర్ణాహుతి భక్తుల సమక్షంలో నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు అష్టోత్తర కుంకుమార్చన పూజలు,మంత్రపుష్పం నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది. నవరాత్రులలో భాగంగా 9వ రోజు శుక్రవారం సాయంత్రం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అలంకారంలో జగన్మాత ఆలయానికి వచ్చిన భక్తులకు దర్శన భాగ్యాలు కల్పించింది. ఈ సందర్భంగా వాసవి మాతను కనులారా వీక్షించి మంత్రముగ్ధులయ్యారు. ఆలయమంతా అమ్మవారి మూల మంత్రంతో ప్రతిధ్వనించింది.