రాష్ట్రస్థాయి పోటీలకు శ్రీ విద్యా సాయి పాఠశాల విద్యార్థులు ఎంపిక

రాష్ట్రస్థాయి పోటీలకు శ్రీ విద్యా సాయి పాఠశాల విద్యార్థులు ఎంపిక

మద్దికేర (న్యూస్.వెలుగు ): మద్దికేరలో  శ్రీ విద్యా సాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి మినీ సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 14 ఆదివారం రోజున కర్నూలులోని గుడ్ షప్పర్డ్ పాఠశాలలో నిర్వహించు 17వ రాష్ట్రస్థాయి మినీ సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ పోటీలకు అండర్ 14 విభాగంలో విద్యాసాయి పాఠశాలకు చెందిన బి.వర్షిత,కే.సురేష్ లు ఎంపికైనట్లు పాఠశాల పిఈటి ఇస్మాయిల్ తెలియజేశారు.రాష్ట్రస్థాయి లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఈనెల 26 నుండి 29 వరకు హైదరాబాదు నందు జరిగే 17వ జాతీయస్థాయి మినీ హ్యాండ్ బాల్ పోటీలలో పాల్గొంటారని పిఈటి ఇస్మాయిల్ తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదివారం రోజున రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొననున్న వర్షిత,సురేష్ లను పాఠశాల కరస్పాండెంట్ వెంకట మాధవ్,ప్రిన్సిపల్ బాల సునీత యాదవ్,పిఈటి ఇస్మాయిల్,పాఠశాల అధ్యాపకులు తదితరులు అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీలలో సత్తా చాటి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావాలని వారు విద్యార్థులకు తెలియజేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS