శ్రీశైలం….చిట్టూట భైరవుడు …

శ్రీశైలం….చిట్టూట భైరవుడు …

న్యూస్ వెలుగు, శ్రీశైలం: శ్రీశైలానికి గల నాలుగు ముఖద్వారాల్లో పూర్వ దక్షిణ ద్వారాలకు నడుముగల మార్గంలో జంగాలమిద్దె నుండి ఐదు కిలోమీటర్లు తూర్పు ద్వారం మార్గం వైపు ప్రయాణం చేస్తే , ఈ రెండు మార్గాల కూడలి దగ్గర చిట్టూట భైరవుని విగ్రహం ఉంది. పూర్వం యాత్రికులు ఈ ప్రదేశంలో బస చేసేవారు. ఇక్కడ శిథిల దేవాలయాలు, మండపాలు, రాతి కోనేరు ఉన్నాయి. రాతి కోనేరు పై మిధున శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. బహుశా అందుకనేమో ఈ ప్రదేశంలో ఎవరు నవ్వకూడదని చెంచులు మమ్మల్ని హెచ్చరించారు. చిట్టూట అంటే చిన్న నీటి ఊట వచ్చే ప్రాంతం అని, నీరూరే తావు అని అర్థం. ఆ రాత్రి మాకు అవసరమైన నీటి సేకరణకు చాలా ప్రయాసపడవలసి వచ్చింది.

Author

Was this helpful?

Thanks for your feedback!