ఎస్ఎస్ఎల్ఎస్ రియల్ ఎస్టేట్ సంస్థ సరసమైన ధరలకు ప్రజలకు ఇవ్వాలి ; ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి
SSLS రియల్ ఎస్టేట్ & కాంట్రాక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్,
కర్నూల్లో బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి
న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూలు నగరంలోని నందికొట్కూరు రోడ్డు చంద్రశేఖర్ నగర్ ఎస్ ఎస్ కాంప్లెక్స్ నందు ఎస్ ఎస్ ఎల్ ఎస్ రియల్ ఎస్టేట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, తెలుగు చలనచిత్ర కథానాయకుడు ఉపేంద్ర, ప్రముఖులు హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, కథానాయకుడు ఉపేంద్ర లు మాట్లాడుతూ, కంచర్ల అచ్యుత్ రావు, ఎస్ ఎస్ ఎల్ ఎస్, రియల్ ఎస్టేట్ హెడ్ ఆఫీస్, తిరుపతిలో ఉన్నది అనుబంధ కార్యాలయం ను మొదటిసారిగా కర్నూల్ లో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మీ వెంచర్లో సరసమైన ధరల కు కర్నూల్ నగర ప్రజలకు అందించాలని ఎమ్మెల్యే ఎస్ ఎస్ ఎల్ ఎస్ రియల్ ఎస్టేట్ సంస్థ వారిని కోరారు. కథానాయకుడు ఉపేంద్ర మాట్లాడుతూ, కంచర్ల అచ్యుత్ కుమార్ గారు రియల్ ఎస్టేట్ మరియు కన్సల్టింగ్ బ్రాంచ్ కార్యాలయం కర్నూల్లో ఓపెన్ చేసుకోవడం జరిగింది ఆయన ఏ రంగంలో ఉన్న సరే ఎస్ ఎస్ ఎల్ ఎస్ క్రియేషన్స్లో ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా కార్మికులకు ఉపాధి కల్పిస్తారు. మంచి ఉద్దేశంతో ఒకేసారి 9 సినిమాలను రిలీజ్ చేశారు. అజయ్ తరుణంలో ఆయన ఎక్కడ లేఔట్ చేసిన సరే తన సొంత కలను నెరవేర్చుకోవడంతోపాటు ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు గా అందులో కూడా భాగస్వామ్యం మాకు కూడా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ ఏ.ఆర్.వి నరేంద్ర కుమార్, ఎస్ఎస్ఎల్ఎస్ రియల్ ఎస్టేట్ కర్నూల్ ఇంచార్జ్ మహమ్మద్ యునుస్ అలీ, రమేష్ యాదవ్, తెలుగుదేశం నాయకులు పెరుగు పురుషోత్తం రెడ్డి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.