సిబ్బంది సమన్వయంతో పని చేయాలి ;  ఎస్పీ

సిబ్బంది సమన్వయంతో పని చేయాలి ; ఎస్పీ

 కానిస్టేబుల్ అభ్యర్ధులకు డిసెంబర్ 30 నుండి ఫిబ్రవరి 1 వ వరకు దేహదారుఢ్య పరీక్షలు.

న్యూస్ వెలుగు, కర్నూలు; ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు( APSLRB) పోలీసు నియామక పక్రియలో భాగంగా ఉమ్మడి కర్నూలు ( కర్నూలు, నంద్యాల) జిల్లా కు సంబంధించి పోలీసుకానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు కర్నూలు APSP 2 వ బెటాలియన్ లో డిసెంబర్ 30 వ తేది నుండి ఫిబ్రవరి 1 వరకు దేహదారుడ్య పరీక్షలు జరగనున్నాయని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సంధర్బంగా శుక్రవారం పరీక్షల నిర్వహణలో పాల్గొనే పోలీసు సిబ్బందితో జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లా ఎస్పీ సమావేశమై మాట్లాడారు.ఫిజికల్ మెజర్మెంట్ & ఎఫిషియన్సీ పరీక్షలను ప్రణాళికాబద్ధంగా, సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. పరీక్షల నిర్వహణ సిబ్బంది బాధ్యతల పై అవగాహన కల్పించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు( APSLRB) ఆదేశాలు, నియమ నిబంధనలు మేరకు ఈ పరీక్షలు సవ్యంగా జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అభ్యర్థులు ఆయా తేదీల్లో నిర్ధేశిత సమయంలోనే చేరుకోవాలన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ జిరాక్సు కాఫీలు వెంట తీసుకు రావాలన్నారు.ఉద్యోగం సాధించాలనే ఒత్తిడిలో అభ్యర్దులు ఉంటారని, వారి పట్ల మర్యాదగా , సహానంతో వ్యవహరించాలని పోలీసుసిబ్బందికి జిల్లా ఎస్పీ గారు సూచించారు.ఈ దేహదారుడ్య పరీక్షలకు సుమారు 10 వేల మంది అభ్యర్ధులు హాజరుకావచ్చన్నారు.అభ్యర్ధులకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ తర్వాత బయోమెట్రిక్, ఎత్తు, ఛాతి వంటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు , ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లు 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ పరీక్షలు ఉంటాయన్నారు. రిజల్ట్ కౌంటర్ వరకు అంచెలంచెలుగా సమగ్రంగా విధులు నిర్వర్తించేలా అవగాహన చేశారు.ఎమైనా సందేహాలు, సమస్యలుంటే పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు.పోలీసు కానిస్టేబుళ్ళ దేహదారుడ్య పరీక్షల రిక్రూట్ మెంట్ పూర్తయ్యే వరకు అందరూ బాగా పని చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ , జిల్లా పోలీసు కార్యాలయం సూపరింటెండెంట్లు , డిపిఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!