టిడిపి కార్యకర్తల కుటుంబాలకు అండగా :ఎమ్మెల్యే బుడ్డా
బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు; తెలుగుదేశం కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి అన్నారు. బండి ఆత్మకూరు మండలంలోని కాకునూరు గ్రామనికి చెందిన టిడిపి బూత్ కన్వీనర్ గత కొన్ని రోజుల కిందట ప్రమాదవశాత్తు పాముకాటుతో మృతి చెందగా పార్టీ సభ్యత్వం ద్వారా రెండు లక్షల నగదు బీమామంజూరు అయింది. ఈ నగదును ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కాకునూరు గ్రామం లో బాధితురాలు కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి కార్యకర్త కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని అన్నారు. అనంతరం కాకునూరు టిడిపి నాయకుడు సిటీ కేబుల్ నాగేశ్వర్ రెడ్డి మనవరాలు జన్మదిన వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నందిపాటీ నరసింహారెడ్డి టిడిపి నాయకులు తదితరుల పాల్గోన్నారు.
Was this helpful?
Thanks for your feedback!