
స్టాంటన్ సేవలు చిరస్మరణీయం
కర్నూలు, న్యూస్ వెలుగు; కోల్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమెరికా బాప్టిస్ట్ మిషనరీ రెవ.WA స్టాంటన్ గారి 157 వ జయంతి వేడుకలు ఈ.సీ.ఎం బాలికల ఉన్నత పాఠశాల నందు ఉదయం 11 గంటలకు నిర్వహించడమైనది. ముఖ్య అతిథులుగా కోల్స్ చర్చి ప్రెసిడెంట్ ఏ. డి .ఏ. లింకన్ డాక్టర్ రెడ్డి పోగు సుస్మిత. కోర్స్ చర్చి పాస్టర్ రెవ. జీవన్ పాల్గొని స్టాంటన్ చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక ప్రార్థనలు చేసిరి స్టాంటన్ మిషనరీగా 40 సంవత్సరంలలో కర్నూలు నందు నివసించి అనేక విద్యాసంస్థలు ప్రార్ధన ఆలయాలు నిర్మించి విద్య ఆధ్యాత్మిక అభివృద్ధికి విశేష సేవలు అందించినారు. మిత్రుడైన డాక్టర్ కోల్స్ ద్రాతృత్వంతో అందించిన ఆర్థిక సహాయముతో అభివృద్ధి చేశారు. కర్నూలు జిల్లా వాసులకు స్టాంటన్ చేసిన సేవలు సదా స్మరణీయం అని అతిధులు కొనియాడి రి ఈ సీ ఎం పాఠశాల విద్యార్థినీలకు కోల్స్ ఫౌండేషన్ వారు 60 మందికి పరీక్ష ప్యాడ్స్ జామెంట్రీ బాక్సులు పెన్నులు పంపిణీ చేశారు.


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar