
ఎన్నికల హామీని విస్మరించిన రాష్ట్ర బడ్జెట్ ; సిపిఎం
కర్నూలు, న్యూస్ వెలుగు; రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ కు అరకొర నిధులు కేటాయించడం తప్ప ఎన్నికల్లో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం కోసం ఎటువంటి ప్రతిపాదనలు ఈ బడ్జెట్ లో లేకపోవడం రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేయడమేనని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం 11,314 కేటాయించడం అంటేనే వ్యవసాయం పట్ల ఈ ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి ఉందో చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. ఈ బడ్జెట్లో రాయలసీమలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టుల గురించి గానీ కర్నూలు జిల్లాలో పెండింగ్ ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు గురించి గానీ ఎక్కడా ప్రస్తావన లేకపోవడం గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని తుంగలో తొక్కడమేనని ఆయన తెలిపారు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాగా ఉన్న కర్నూలు జిల్లాకు సాగు, తాగునీరు లేక వలసలు పోతుంటే వలసల నివారణ కోసం ఎటువంటి ప్రతిపాదనలు ఈ బడ్జెట్ లో లేకపోవడం బాధాకరమైన విషయమని ఆయన తెలిపారు. నిరుద్యోగ భృతి గురించి గానీ ఉచితపస్తు ప్రయాణం గురించి గానీ విద్యుత్తు చార్జీల తగ్గింపు గురించి గానీ ఈ బడ్జెట్లో ఎటువంటి ప్రస్తావన లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని ఆయన తెలిపారు. అమలు కానీ అమరావతి భానుపుచర్ల ప్రాజెక్టు గురించి ప్రస్తావించడం అది రాయలసీమ ప్రజలను మోసం చేయడమేనని ఎండమావులు చూపించి ఇదిగో వస్తుంది నీరు అని చెప్పేసి చెప్పిన పద్ధతుల్లో ప్రభుత్వం యొక్క వ్యవహారం ఉందని ఆయన ఘాటుగా విమర్శించారు భాను చర్ల ప్రాజెక్టుకు 80000 కేటాయించడం కంటే రాయలసీమ ప్రాంతంలో కనీసం 20 వేల కోట్ల రూపాయలు కేటాయించిన అన్ని సాగునీటి ప్రాజెక్టు పూర్తి అయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు అలాంటి పని ఎందుకు చేయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని ఎల్లకాలం రాయలసీమ కర్నూలు జిల్లా ఎడారిగానే ఉండాల్సిన పరిస్థితి వస్తుందని ప్రభుత్వం అనుసరించే విధానాలను ప్రజలు కూడా తెలుసుకోవాలని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ గురించి బడ్జెట్ ప్రసంగంలో మాట మాత్రం కూడా చెప్పకపోవడం చదువుకున్న యువతీ యువకులను మోసం చేయడమేనని ఆయన తెలిపారు ఐటిరంగం అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది దానివల్ల ఉపాధి కలుగుతుందని మభ్యపెట్టే ప్రయత్నం ఈ బడ్జెట్ లో ఉందని ఆయన తెలిపారు.


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar