ఘనంగా రాష్ట్ర మంత్రి టిజి భరత్ కుమార్తె రిసెప్షన్ వేడుక

ఘనంగా రాష్ట్ర మంత్రి టిజి భరత్ కుమార్తె రిసెప్షన్ వేడుక

కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు నగరంలోని ఎస్ ఏ పి క్యాంపులో నిర్వహించిన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ కుమార్తె రిసెప్షన్ వేడుక వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కర్నూలుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేలాదిగా ప్రజలు తరలివచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రి సవితమ్మ, ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ, జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి. నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు, భూమా అఖిలప్రియ, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, బి.వి జయ నాగేశ్వర్రెడ్డి, పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, పరిటాల సునీత, ప్రముఖ నాయకులు, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, అధికారులు హాజరయ్యారు.

Author

Was this helpful?

Thanks for your feedback!