
ఉప్పర్లపల్లి లో పోటాపోటీగా రాతిదూలం పోటీలు
రాతిదూలం పోటీలను ప్రారంభించిన టీడీపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర.
తుగ్గలి,  న్యూస్ వెలుగు ప్రతినిధి: మండలం పరిధిలోని ఉప్పర్లపల్లి గ్రామంలో గల మౌలాలి స్వామి ఉరుసు గ్రామ ప్రజలు, భక్తులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.మొదటగా ప్రజలందరూ మౌలాలి స్వామి దర్గాకు వెళ్లి పూజలు నిర్వహించి తమ మొక్కులను తీర్చుకున్నారు.ఉప్పర్లపల్లి గ్రామంతో పాటు వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు కూడా ఉరుసులో పాల్గొని మౌలాలి స్వామిని దర్శించుకుని తమ మొక్కలు తీర్చుకున్నారు.మౌలాలి స్వామి ఉరుసు సంధర్భంగా గ్రామంలో ఏర్పాటుచేసిన
రాతిదూలం పోటీలను టీడీపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర ప్రారంభించారు.పోటాపోటీగా జరిగిన రాతిదూలం పోటీలు జరిగాయి. పోటీలలో గెలుపొందిన వృషభాల యజమానులకు నిర్వాహకులు నగదు బహుమతులను ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి సీనియర్ నాయకులు అప్పా వేణు,మాజీ సర్పంచ్ శ్రీనివాస గౌడ్,నీలా ప్రసాద్,నీలా మనోహర్,కేశవ రెడ్డి,విద్యా కమిటీ చైర్మన్ కంబగిరి,ఈశ్వరయ్య,సుంకప్ప, అప్పా వెంకటేష్,భాస్కర్,విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జొన్నగిరి ఎస్సై జయశేఖర్ గౌడ్ తమ పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు.


 Journalist Pinjari Imamulu
 Journalist Pinjari Imamulu