
రైతులను అవమానపరుస్తున్న బ్యాంకులు ,సొసైటీలు: సీపిఐ
బి.గిడ్డయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి
కర్నూ లు, న్యూస్ వెలుగు; కర్నూలు కేంద్ర సహకార బ్యాంకు,సొసైటీలు రైతులకు ఇచ్చిన రుణాలు రికవరీ పేరుతో చిప్పగిరి మండలం బెల్డోన, నగరడోన గ్రామాలతోపాటు ఆలూరు లో రైతుల ఇళ్ళలేక జొరబడి రైతుల ఆస్తులను బలవంతంగా ఇంటిలో ఉన్న వస్తువులను జప్తు చేయడం రైతులను అవమానించడం తక్షణమే ఆపాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య డిమాండ్ చేశారు. అప్పులు చెల్లించడానికి కొంత సమయం కావాలని రైతుల కోరినప్పటికీ పట్టించుకోకుండా రైతులను తీవ్రంగా మనోవేదన గురి చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.జిల్లాలో కరువు కాటకాల కారణంగా పంటలు పండక రైతులు అప్పుల పాలై అనేకమంది ఆత్మహత్య చేసుకుంటున్నారని,పశ్చిమ ప్రాంతం ఆలూరు ఆదోని పత్తికొండ ఎమ్మిగనూరు మంత్రాలయం నుండి సుదూర ప్రాంతాలకు లక్షలాది కుటుంబాలు వలస పోయి జీవనం గడుపుతున్నారని,ఈ సమయంలో రైతులకు, ప్రజలకు భరోసా, ధైర్యం కల్పించాల్సిన ప్రభుత్వం రుణాల రికవరీ పేరుతో కేంద్ర సహకార బ్యాంకు,సొసైటీలు ఇచ్చిన రుణాలను బకాయిల వసూళ్ల పేరుతో బలవంతంగా రైతుల ఇళ్లలోకి త్వరపడి ఇంట్లో ఉన్న వస్తువులు ఏది దొరికితే అది దౌర్జన్యంగా ఎత్తుకెళ్లడం దారుణమని దీని కారణంగా రైతులు తీవ్రంగా మనోవేదన చెందుతున్నారని తక్షణమే బలవంతపు జప్తులకు స్వస్తి పలకాలని కేంద్ర సహకార బ్యాంకు అధికారులను కోరారు.ఈ విషయంలో తక్షణమే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జిల్లాలో రైతులకు ప్రభుత్వము అండగా నిలబడాలని డిమాండ్ చేశారు.
బి.గిడ్డయ్య
సిపిఐ జిల్లా కార్యదర్శి,