ఆశాల అక్రమ తొలగింపులు ఆపండి
మండల ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్
బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు; ఆశలపై రాజకీయ వేధింపులు అక్రమ తొలగింపులు ఆపాలని శుక్రవారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మండల ఆశా వర్కర్స్ యూనియన్ సభ్యులు సిఐటియు నాయకులు ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు యేసు రత్నం మండల నాయకులు రాజురత్నం ధర్నాలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్కువ వేతనంతో గర్భిణీలు బాలింతలు చిన్న పిల్లలు టీవీ రోగులకు అనేక రకాల సేవలు అందిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆశాలపై రాజకీయ వేధింపులు అక్రమ తొలగింపులు చేయడం సరికాదని అన్నారు. కుటుంబ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే ఆశలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యాలు పని భారం తగ్గిస్తామని మేనిఫెస్టో పెట్టారని వాటిని వెంటనే అమలు చేయాలని అన్నారు. అనంతరం డాక్టర్ కు నుంచి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఆశాలు పాల్గొన్నారు.