ఇ ఎస్ ఐ హాస్పిటల్ ను కర్నూలుకు తరలించడం ఆపాలి

ఇ ఎస్ ఐ హాస్పిటల్ ను కర్నూలుకు తరలించడం ఆపాలి

ఆదోని న్యూస్ వెలుగు : ఇ ఎస్ ఐ హాస్పిటల్ ను కర్నూలుకు తరలించడం ఆపాలలని, వైద్యం కార్మికులకు అందించాలని కార్మిక సంఘాలు ఈఎస్ఐ చందా దారులు డిమాండ్చేశారు.

సోమవారం ఈఎస్ఐ లబ్ధిదారుల ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు పిఎస్ గోపాల్ తిప్పన్న నాయకులు ఈరన్న,ఈఎస్ఐ లబ్ధిదారులు భాష,, మున్సిపల్ వర్కర్లు సోమన్న అహ్మద్ మాట్లాడుతూ గత 50 సంవత్సరములు మన ఆదోనిలో ఈఎస్ఐ హాస్పిటల్స్ సౌకర్యం ఏర్పాటు చేశారని కార్మికుల చెందాదారులుగా ఉంటూ వైద్యం లభిస్తుందని ఆశించేవారు ఇప్పుడు ఈఎస్ఐను రెండు భాగాలుగా చేసి ఈస్ట్ వెస్ట్ అని వైద్యం అందిస్తున్నారని అయితే ఈస్ట్ లో పని పడకల ఆసుపత్రి ఉన్న ఇప్పటికి మెరుగైన వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇక్కడ డాక్టర్లు , మరియు ఈసీజీ మందుల కొరత ఉండటం వలన ఈఎస్ఐ లబ్ధిదారులకు వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వం ఈఎస్ఐ హాస్పిటల్ కర్నూలుకు తరలించాలని ఆలోచన ఉందని దీనిని తక్షణమే విరమించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు, ఈఎస్ఐ లబ్ధిదారులు 3000 మంది కుటుంబాలు ఉన్నాయని వీటితోపాటు చుట్టూ ప్రక్కల ఎమ్మిగనూరు ఆలూరు పత్తికొండ ప్రాంతాల వారు ఉన్నారని కార్మికులకు మెరుగైన వైద్యం వాస్తుందని వచ్చి వైద్యం అందక నిరుత్సాహంతో వెళ్లిపోతున్నారు అన్నారు కావున ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మరియు అధికారులు ఈఎస్ఐ లబ్ధిదారులకు మెరుగైన వైద్యం అందించాలని కర్నూలుకు తరలించడం ఆపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దేవేంద్ర తిక్కప్ప శంకర్ మధు తదితరులు పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS