
విద్యార్థులూ..ఆల్ ద బెస్ట్
జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ వెలుగు; విద్యార్థులూ..ఆల్ ద బెస్ట్ అని పదవ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా శుభాకాంక్షలు తెలియజేశారు.. “మీ ఉజ్వల భవిష్యత్తుకు మొదటి మెట్టు ఈ పదవ తరగతి.. ఖచ్చితంగా పాస్ అవుతాం అని పాజిటివ్ థింకింగ్ తో పరీక్షలు రాయండి..ఎలాంటి ఒత్తిడికి గురి కావొద్దు.. భయం వద్దు..ఆందోళన చెందవద్దు..ప్రశాంతంగా పరీక్షలు రాయండి..లక్ష్యాన్ని చేరుకోవాలన్న పట్టుదలతో విజయం సాధించండి.. మీరందరూ ఈ పరీక్షల్లో పాస్ అవుతారని నమ్మకం నాకుంది.. మీరు కూడా నమ్మండి.. పరీక్షలు చక్కగా రాయండి.. మంచి ఫలితాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నా..నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నా.. మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు”
అని జిల్లా కలెక్టర్ పదవ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ విషెస్ తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!