
మైనార్టీ బాలుర హాస్టల్లో విద్యార్థులే పనిమనుషుల..!
కలం పట్టాల్సిన చేత పారలు పట్టిస్తున్న మైనార్టీ బాలుర హాస్టల్…!
చదువుకోవాల్సిన విద్యార్థుల చేత పనిచేయించడం ఎంత వరకు సమంజసం
కర్నూలు సంక్షేమ భవన్, న్యూస్ వెలుగు; కర్నూల్ నగరంలో ఉన్న మైనారిటీ బాలుర హాస్టల్ నందు పైప్ లైన్ లీక్ అవ్వడం ద్వారా వాచ్మెన్ రిపేర్ చేసిన అనంతరం విద్యార్థుల చేత మూసి వేస్తున్నారు.
వంట గదిలో వంట చేసిన అనంతరం శుభ్రం చేయకుండా వెళ్ళిపోతున్నారని, భోజన శాల చుట్టుపక్కల చెత్తాచెదారంతో మరియు హాస్టల్ చుట్టుపక్కల మురికి కాలువ తెరిచి ఉండడం ద్వారా రాత్రి సమయాలలో విష సర్పాలు రావడం జరుగుతుందని విద్యార్థులు తెలియజేశారు. విద్యార్థులు బస చేస్తున్న వసతి గృహం చుట్టూ కిటికీలు విరిగిపోవడాని గమనించవచ్చు.వసతి గృహం చుట్టూ మురిగినీటితో మరియు చెత్తాచెదారంతో నిండి ఉండడం ద్వారా విష జ్వరాలకు గురవుతున్నారు.
స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుని విచారించగా….
హాస్టల్ చుట్టూ ఎప్పటికప్పుడు శుభ్రంగా చేస్తున్నాను అని, కిటికీలు విరిగిపోవడం ద్వారా ప్రతి కిటికీకు మెస్ వేయించడం జరిగిందని తెలియజేశారు. ఇలాంటి చిన్న చిన్న రిపేరులకు సంవత్సరానికి 5000 చొప్పున ప్రభుత్వం కేటాయించిందని, 5000 రూపాయలు సరిపోవడం లేదని ఇంకా ఎక్కువ బడ్జెట్ ను కేటాయించాలని ఆవేదాన్ని వ్యక్తం చేశారు.
సాయంత్రం చేయాల్సిన వంటను మధ్యాహ్నం రెండు గంటలకి చేసి వెళ్తున్నారని, విద్యార్థులకు వేడివేడి భోజనాన్ని అందించాల్సి ఉండగా, చల్లటి భోజనాన్ని అందిస్తున్నారని విద్యార్థులు తెలియజేశారు. ఇది ఇలా ఉండగా రాత్రి వేళలో లైట్లు లేకుండా ఎలా ఉండాలి అని విద్యార్థుల యొక్క ఆవేదన, రెండు లైట్లు వేయించాలని కోరడం జరిగింది.