రాష్ట్రస్థాయి అండర్ 17 ఫుట్బాల్  పోటీలకు పెండేకల్ ఆర్.ఎస్ విద్యార్థులు ఎంపిక

రాష్ట్రస్థాయి అండర్ 17 ఫుట్బాల్ పోటీలకు పెండేకల్ ఆర్.ఎస్ విద్యార్థులు ఎంపిక

* విద్యార్థులను అభినందించిన పాఠశాల సిబ్బంది

తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండల పరిధిలోని గల పెండేకల్ ఆర్.ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు అండర్ 17 ఫుట్బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ పాండురంగరాజు తెలియజేశారు.ఈ సందర్భంగా గురువారం రోజున వారు మాట్లాడుతూ ఈనెల 21న కర్నూలులో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెలక్షన్స్ నందు అండర్ 17 ఫుట్బాల్ రాష్ట్ర స్థాయి పోటీలకు పెండేకల్ ఆర్ఎస్ పాఠశాల విద్యార్థులైన పి.దీపిక,ఏ.రాజేష్ లు ఎంపికయ్యారని వారు తెలియజేశారు.ఈనెల 28న వినుకొండలో జరిగే రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలలో ఈ విద్యార్థులు పాల్గొంటారని పి.డి పాండురంగరాజు తెలియజేశారు.రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.కె నరేంద్ర ప్రసాద్,ఫిజికల్ డైరెక్టర్ పాండురంగరాజు మరియు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అమీనా బేగం విద్యార్థులను అభినందించారు.రాష్ట్రస్థాయి పోటీలలో కూడా సత్తా చాటి పాఠశాలకు మరియు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని వారు తెలియజేశారు. విద్యార్థులు ఎంపిక పట్ల గ్రామ పెద్దలు మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!