సైబర్ క్రైమ్ పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి

సైబర్ క్రైమ్ పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి

     ఒకటో పట్టణ సిఐ రామానాయుడు

 న్యూస్ వెలుగు,  కర్నూలు; విద్యార్థులు సైబర్ క్రైమ్ పట్ల అవగాహన ఉండాలని ఒకటో పట్టణ సీఐ రామానాయుడు అన్నారు. కర్నూలు పాత నగరంలోని నారాయణ పాఠశాలలో విద్యార్థులకు ఏజీఎం రామాంజనేయులు ఆధ్వర్యంలో శుక్రవారం సైబర్ క్రైమ్ పట్ల అవగాహన సదస్సులను నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐ రామానాయుడు మాట్లాడుతూ సెల్ ఫోన్ వాడకం వల్ల ఉపయోగాల తోపాటు, మోసపూరిత ప్రకటన సైతం వస్తుంటాయని అలాంటి ప్రకటనలతో అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. అపరిచితులు చేసే కాల్చుకు రెస్పాండ్ అవ్వద్దు అని సూచించారు. విద్యార్థుల రక్షణ కోసం స్టేషన్లో ప్రత్యేకంగా దిశ ఆఫీసును ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ అబ్దుల్ అజీజ్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!