ముంబైలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అధ్యయన పర్యటన

ముంబైలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అధ్యయన పర్యటన

   పర్యటన పాల్గొన్న ఎం.పి బస్తిపాటి నాగరాజు

కర్నూలు, న్యూస్ వెలుగు; మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని ముంబైలో మంగళవారం వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం  ప్రజా పంపిణీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అధ్యయన పర్యటన నిర్వహించింది.. ఈ పర్యటన లో కమిటీ సభ్యుడైన కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు..పర్యటన లో భాగంగా కమిటీ ఛైర్మన్ కనిమొళి కరుణానిధి అధ్యక్షత న కమిటీ సభ్యులు ముంబైలో ప్యాక్ చేసిన వస్తువులను నియంత్రించడం, బేబీ ఫుడ్స్ మరియు ఇతర ఆహార పదార్థాలలో చక్కెర కంటెంట్‌పై దృష్టి సారించడంపై సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, పెప్సికో ఇండియా, కోకా-కోలా ఇండియా, నెస్లే ఇండియా, డానోన్ ఇండియా, మోండెల్జ్ ఇంటర్నేషనల్ (ఇండియా) మరియు అబాట్ ఇండియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!