మంచిగా చదివి ఉన్నత స్థాయికి  ఎదగాలి 

మంచిగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి 

హోలగుంద, న్యూస్ వెలుగు;  మండలంలో పరిధిలో సులువాయి గ్రామంలో జడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థుల సమస్యలపై హెచ్ఎం శాంతి మూర్తి మాట్లాడుతూ తల్లితండ్రులు అడుగడుగునా కూటమి నేతలను నిలదీస్తున్నారు. సులవాయి గ్రామంలో కూటమి నేతలు, విద్యా కమిటీ చైర్మన్ మహేష్ ఆధ్వర్యంలో విద్యార్థి తల్లి తండ్రులు ఏకమై ప్రధానోపాధ్యాయుడిని హెచ్ఎం బీరప్ప అడిగి విచారించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అంటూ ప్రశ్నిస్తూ పాఠశాల వసతుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు విద్యార్థులు తెలియజేస్తూ పాఠశాలలో భోజనం రుచికరంగా లేదని నీళ్ల సాంబార్ అందిస్తున్నారని ప్రభుత్వం ప్రతిపాదించిన మెనూ అందించడం లేదని విద్యార్థినీ విద్యార్థులుతెలుగుదేశం పార్టీ నాయకులకు, స్కూల్ కమిటీ చైర్మన్ కు వివరించారు. దీనిపై తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడుతూ వంట ఏజెన్సీలను అడిగి విచారించారు. ఈ ఘటనను విద్య కమిటీ చైర్మన్ మహేష్ సీరియస్ గా తీసుకుంటామని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని ప్రకటించారు. స్కూల్ కమిటీ చైర్మన్, ప్రధానోపాధ్యాయుడు ని తెలుగుదేశం పార్టీ నాయకులు విచారిస్తూ పాఠశాల లో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయని విద్యార్థిని విద్యార్థులు తరగతుల బయటనే విద్యను ఇబ్బందికి గురవుతున్నారని . ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వం పరిపాలనలో నాడు నేడు పథకం కింద తరగతి గదులు మంజూరయ్యాయని సగం పనులు పూర్తయి బిల్లులు మంజూరు అవ్వక ఆగిపోయాయని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన శుభ పరిణామాన ప్రభుత్వ పెద్దల దయతో ఆగిపోయిన పనులు పూర్తి అవ్వాలని ప్రధానోపాధ్యాయుడు కోరారు. దీంతో స్పందించి మీ సమస్యలను పార్టీ పెద్దలు దృష్టికి తీసుకెళ్లి త్వర తగతిన పాఠశాల గదులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వీరేష్ సిద్ధం గౌడ్ ప్రతి ఒక్క టీచర్స్ పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!