మద్దికేర న్యూస్ వెలుగు ప్రతినిధి: రబీ-2024 సీజన్ కు సంబంధించి మద్దికేర మండలానికి 3890 క్వింటాళ్ల జేజి-11 రకం పప్పు శనగను కేటాయించినట్లు మద్దికేర మండల వ్యవసాయ అధికారి రవి తెలియజేశారు.

మంగళవారం రోజున మండల కేంద్రమైన మద్దికేర లోని స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయం నందు ఆయన మాట్లాడుతూ క్వింటం పప్పు శనగ పూర్తి ధర 9400 రూపాయలు కాగా,ఇందులో ప్రభుత్వ సబ్సిడీ 25% అనగా 2350 రూపాయల సబ్సిడీ పోగా రైతు క్వింటానికి 7050 రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ ను చేయించుకోవాలని మద్దికేర మండల వ్యవసాయ అధికారి రవి తెలియజేశారు. రైతులు మరింత సమాచారం కొరకు తమ పరిధిలోని గల స్థానిక రైతు సేవా కేంద్రాలను సందర్శించి వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా తెలుసుకోవాలని ఏవో రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.
Thanks for your feedback!